ఆ దెస నుండి యీ దెసకు నాకసముండుటదేలయన్నచోనా దెస నుండి యీ దెసకు నా శశి దాగుడు మూతలాడగానాదర భావనా గరిమ నంతట పర్విన గాత్రమై ,మనోనాదపు విందులన్ గరపు నాయిక నాయక బంధమే సుమా!✍️
హత యురగాంగన నైనన్, ఖతలముఁ దాకు శిఖకీలగయినైనన్, సంతతమింపగు కూరిమితోస్మితవదనగ పలకరించు చెలియను గానో! ✍️ 
దూరమునున్ననేమి మది దోచిన దొంగవులే దొరా! నినున్దూరను దేనికైననొక దోషము లేదని యూరకుందు, నీభారము నోపగా విరహ బాధల తాళగ జాలు ధీరఁ గాబీరపు బల్కులన్ పలుకు బేలను, ప్రేమగ పల్కరించినన్తీరును చింతవంతలిక తీయని మాటల జాలమందునన్.✍️ 
మరులలో మైమరుపులందం, ఔను.మతిమరుపులు....ఊహూ..  ఝరులలో సడుల సవ్వడులందం, ఔను.  బంధనాలు, నిబంధనలు ... ఊహూ..కదా, అలాగే మరి!   విరులలో గంధవిహరణలందం, ఔను.   ప్రహరీలు, ప్రహారాలు....ఊహూ..కదా, అలాగే మరి! మరులలో మైమరుపులందం, ఔను.మతిమరుపులు ....ఊహూ...✍️
వాన పరీమళమ్ములివి వానలు తీర్చిన పిమ్మటంగదామేనుననావరించుకొనె మెల్లగ మెల్లగ మెల్లమెల్లగా! కానకపోయెనే వరుణకాంతుడు వానల నిచ్చునాతడేకోనలకేగెనో! ధరణి కొమ్మయి వేచెడివేళఁ గానడే!✍️
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు