కాల ప్రవాహం సాగుతూనే ఉంది మనిషి మనుగడను ప్రశ్నిస్తూ మనసెప్పుడూ ఆరని చితిలాంటిదే భావాల మహాభారత యుద్ధంలో అక్షరాలకు అంటరానితనం అంటుకుంటోంది కులం చేతిలో కీలుబొమ్మగా మారుతూ కళలు ఈర్ష్యల కుంపట్లలో కాలిపోతున్నాయి సాహిత్యమెా ఉన్మాద క్రియగా సాగుతూ అదుపు తప్పిన కలం అడ్డదిడ్డంగా రాస్తోంది నైతిక విలువలకు తిలోదకాలిస్తూ మన తలరాతను రాతలే బయటపెడతాయి పదుగురు పరమార్ధం [...]
నవమాసాలు మెాయకున్నా రక్తం పంచివ్వని బంధమైనా మమతలకు నెలవై మానవత్వానికి మరో రూపమై జీవకారుణ్యమే జీవిత ధ్యేయంగా ఓరిమికే ఓదార్పుగా శాంతి సహనాలకు చిరునామాగా అన్నార్తుల పాలిటి అన్నపూర్ణగా దివి నుండి భువికి ఏతెంచిన అమృతమూర్తి ఈ అమ్మ సకల మానవాళికి ఆదర్శమే...!!
కలలేమి రాకపోయినా తెల్లారిపోతూనే ఉంటుంది మరో రోజుగా మారిపోతూ ఆత్మకు శరీరానికి అవసరమైన అనుసంధాన వేళప్పుడు ఏకాంతానికి స్వాగతం పలుకుతూ ముహూర్తాలు కుదరలేదన్నా ముద్దుముచ్చట్లు తీరలేదన్నా ఎవరి కోసమూ కాలమాగనంటుంది  అస్పష్టపు నీడలకు కప్పిన ముసుగు తెరలను తొలగించాలని వాస్తవాన్ని ఆదేశిస్తూంటే వెలుతురు పొద్దు సెగకు తాళలేక వెన్నెల చల్లదనానికై చూస్తూ కలల లేమి [...]
సముద్రాన్ని చూడు ఎంత గుంభనంగా ఉంటుందో లోలోపల ఎన్ని బడబానలాలున్నా పైకి ప్రశాంతంగా కనిపిస్తూ చూస్తూనే ఉన్నావుగా   చీకటంతా నా చుట్టమైనా  వెలుగుల కోసం వేగిరపడని  నిశ్శబ్ద నిరీక్షణ నాదని  నీకు తెలుసు కదాకాలమాడుతున్న దోబూచులాటలోమనసుకు దేహానికి కుదరని సమతూకంమారణాయుధమై వెన్నంటే ఉందనిక్షణాల ఆశల ఆరాటానికియుగాల ఎదురుచూపుల  ఏకాంతాల సహవాసానికి [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు