"రాయినై ఉన్నాను ఈ నాటికీ...  రామ పాదము రాక ఏనాటికీ..."నిరుపమాన కవి, సినీ గీత రచయిత వేటూరి సుందర రామ్మూర్తికి తాను రాసిన వేలాది పాటల్లో బాగా ఇష్టమైన పాట - బహుశా - "వేణువై వచ్చాను భువనానికి.. గాలినైపోతాను గగనానికి.. " అయి ఉంటుంది. 1993 లో వచ్చిన 'మాతృదేవోభవ' సినిమా కోసం రాసిన ఈపాటని ఆ తర్వాత అనేక సందర్భాలలో తల్చుకోవడంతో పాటు, 'వేణువై వచ్చాను' పేరిట ఆత్మకథ రాయాలని ఒక దశలో [...]
అసలైతే గడిచిన ఏడాదంతా విస్తృతంగా టపాలు రాసేసి 'దశాబ్ది ఉత్సవాలు' ఘనంగా నిర్వహించాలని బోల్డన్ని ప్లాన్లేసుకున్నాను. 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అని 'మనసుకవి' అల్లప్పుడెప్పుడో చెప్పేశారు కదా. అందుకనే, ఆయనే చెప్పినట్టు 'జరిగేవన్నీ మంచికని' సరిపెట్టేసుకుని, ఈ పుట్టిన్రోజు పోస్టు రాయడానికి ఉపక్రమించానన్నమాట. ఇంకెందుకాలస్యం? 'అక్షింతలు' [...]
హైస్కూలు రోజుల నాటి బరువైన వేసవికాలపు మధ్యాహ్నాలు యిట్టే గడిచిపోయేలా చేసిందీ, అటుపైన సాహిత్యపు రుచిని మప్పిందీ ఒక్కరే.. ఆమె తెలుగుసాహిత్యపు 'నవలాదేశపు రాణి' యద్దనపూడి సులోచనా రాణి. సెలవురోజుల్లో క్లాసేతర పుస్తకం చేతుల్లో కనిపిస్తే కన్నెర్రజేసే అమ్మానాన్నా కూడా, ఆ పుస్తకం సులోచనారాణిది అని గమనిస్తే చూసీ చూడనట్టు తప్పుకునేవారు. అమ్మ, అత్తయ్యలు. పెద్దమ్మలు, [...]
'మహానటి' అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు సావిత్రి. దక్షిణ భారత సినీ పరిశ్రమ మీద తనదైన ముద్ర వేసి, సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని నిర్మించుకున్న సావిత్రి భౌతిక ప్రపంచాన్ని విడిచి దాదాపు నాలుగు దశాబ్దాలు గడుస్తున్నా, ఆమె కథ సినిమాగా రికార్డు అవ్వలేదు. బహుశా, నాగ్ అశ్విన్ అనే యువ దర్శకుడి కోసమే ఆ అవకాశం ఇన్నాళ్లూ వేచి చూసిందేమో అనిపించింది, వైజయంతి మూవీస్, స్వప్న [...]
"పద్నాలుగో ఆర్ధిక సంఘం నిబంధనల కారణంగా ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం.." గత కొన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ నాయకులు పదేపదే చెబుతున్న విషయం ఇది. ఆ ఆర్ధిక సంఘానికి సారధ్యం వహించింది ఆంధ్రప్రదేశ్ కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి యాగా వేణుగోపాల రెడ్డి. పూర్తి పేరు కాకుండా, వై.వి. రెడ్డి అనే పొట్టి పేరు ప్రస్తావిస్తే రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఆర్బీఐ) [...]
పేజీ :   < ముందు    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు