శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-03-2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.    కందము:  మగటిమి మత్స్య యంత్రమును   తెగి పడగను నరుడు కొట్ట  దిగువకు వేగన్ తెగ మెచ్చుకొనగ నందరు  గగనమ్మున నొక్క చేఁప గంతులు వేసెన్.   
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01-03-2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మసి యొనర్చెను శంకరున్ మన్మథుండు తే.గీ:  పూల విల్లును చక్కగా బూని చేత  బీరమాడుచు బాణముల్ వేయ నతని  మసి యొనర్చెను, శంకరున్ మన్మథుండు లొంగదీయుట గలదటే లోకమందు.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 19 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - రాముని సుతుఁడర్జునుండు రావణు గెలిచెన్. కందము:  సోమూ!కుశుడెవ్వడురా?  భీమునితమ్ముండెవడుర? భీమ రణంబున్  రాముండెవరిని గెలిచెను?  "రాముని సుతుఁ- డర్జునుండు- రావణు గెలిచెన్."
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్. కందము:  ఓసారెంటీయారూ! మీ సములన్ గనఁగఁ గలమె మేదినియందున్  వేసము కృష్ణుని రూపున  మీసములన్ గనఁగఁ గలమె మేదినియందున్.
శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 02 - 2018 న ఇచ్చిన సమస్యకు నా పూరణ సమస్య - అక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.  కందము:  ముక్కున కోపమ్మేలనె  ముక్కెరనే దెత్తునీకు ముడవకె మూతిన్ మక్కువ దీర్చగ రా ! రమ  ణక్కా యిటు రమ్మని మగఁ డాలిన్ బిలిచెన్.
పేజీ :    తరువాత >  

Kinige
Custom Search
జల్లెడ గురించి సహాయం

నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు