నేను నిన్ననే శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు వ్రాసిన “శోభన్ బాబు - జీవిత చరిత్ర” చదివాను. దానికి టాగ్లైన్ “పరుగు ఆపడం ఓ కళ..” 360 పేజీల పుస్తకాన్ని మొదలుపెట్టినదానిని ఆపకుండా చదివేసానంటే ఆ పుస్తకం ఎంత బాగుందో అర్ధమైపోతుంది. ఏ పుస్తకం యెందుకు చదవాలీ అని తెలుసుకోవాలనుకున్నవాళ్ళకు శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్రగారు తెలియకుండా వుండరు. విద్యార్థులను విజయంవైపు నడిపించడానికి ప్రేరణ [...]
  సామాన్యుడికి, ఆ మాటకు వస్తే ఎవరికయినా వారి వారి దినవారీ ఒత్తిళ్ళ నుంచి ఒకింత ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి  ఇవి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. కారణం తెలియదు కానీ రాజకీయ నాయకుల్లో ఈ సెన్స్ ఆఫ్  హ్యూమర్ అనే లక్షణం  రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒక కార్టూనును  కానీ, లేదా ఒక హాస్య స్పోరక కధనాన్ని కానీ [...]
  విషయం ఒక్కటే. కానీ చూసే  ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే,  వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు  యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి,  ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, [...]
  యుద్దభూమి సినిమాలోని ఒక హాయైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చిత్రం : యుద్దభూమి (1988)సంగీతం : చక్రవర్తిసాహిత్యం : వేటూరిగానం : బాలు, జానకిజాలి జాలి సందెగాలి లాలిపాడినా తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా.. బహుశా.. ప్రేమించిందో ఏమో నా [...]
  కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."మద్యమును గ్రోలువాఁడెపో మనుజుఁ డిలను"(లేదా...)"మద్యముఁ గ్రోలు మానవుఁడె మానితకీర్తి గడించి మించురా"ఈ సమస్యను పంపిన బండకాడి అంజయ్య గారికి ధన్యవాదాలు. 
  కె.రామలక్ష్మిగారి “అద్దం” కథలసంపుటి.. కె. రామలక్ష్మిగారి కథలసంపుటి “అద్దం” చదవడం ఇప్పుడే పూర్తి చేసాను. నేను పుస్తకాలు విపరీతంగా చదివే రోజుల్లో చాలా ఇష్టపడి చదివే రచయిత(త్రు)లలో ఈవిడ కూడా ఒకరు. ముఖ్యంగా ఈవిడ సృష్టించిన పార్వతీ, కృష్ణమూర్తిల పాత్రలంటే ఎంతిష్టమో చెప్పలేను. 2009లో ప్రచురించబడిన, 278 పేజీలున్న ఈ “అద్దం” పుస్తకంలో 28 కథలు ఉన్నాయి. ఏ కథ ప్రాముఖ్యత ఆ [...]
  యాత్రలో మా వెంట వచ్చిన గైడ్ పేరు చవాన్. కేదార్ గురించి, బదరీ గురించి అతనే మాకో విషయం చెప్పాడు. “కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా  వుంటాయి. అవి ఎల్లవేళలా ఆక్సిజన్ విడిచిపెడుతూ వుంటాయి కనుక అంత ఎత్తున వున్నా  ఆయాసం అనిపించదు. బడరీలో చెట్లు వుండవు. ఎత్తుకు పోయిన కొద్దీ గాలిలో ఒత్తిడి తగ్గి, ఆక్సిజన్ సరిగా అందదు అంచేత నడిచేటప్పుడు మాట్లాడ కూడదు. మాట్లాడితే ఆయాసం [...]
  రన్ సినిమా కోసం విద్యాసాగర్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఈ పాట సినిమాలో లేదనుకుంటాను వీడియో దొరకలేదు. ఎంబెడెడ్ వీడియో ప్రజంటేషన్ ఇక్కడ చూడవచ్చు.చిత్రం : రన్ (2003)సంగీతం : విద్యాసాగర్రచన : ఎ.ఎం.రత్నం, శివ గణేష్గానం : బలరామ్ , సాధనా సర్గంచలిగాలి చలిగాలి పరవశమా పరవశమాచలిగాలి చలిగాలి పరవశమా [...]
  కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."ప్రేమ పొంగిపొరలె వీథులందు"(లేదా...)"ప్రేమయె పొంగిపొర్లె నడివీథులలో జనులెల్లఁ జూడఁగన్"ఈ సమస్యను పంపిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.
  నేస్తం,         కనీసం కాకులకున్నపాటి నీతి కూడా జన్మలన్నింటికన్నా ఉత్తమెత్తమమైన మానవజన్మ ఎత్తిన మనకు ఉండటం లేదు. ఒక్క కాకి చనిపోతే వందల కాకులు చేరతాయి, కనీసం నీళ్ళు కూడా ముట్టవు. సన్మానాలు, సత్కారాలు, బిరుదులు, పురస్కారాలు, పదవులు  పొందగానే సరి కాదు. కనీసం మానవతా విలువలు కూడా మర్చిపోతున్నాం. మొన్నీమధ్య రచయిత, డాక్టరు అయిన ఒక మంచి వ్యక్తి చనిపోతే దూరం నుంచి వెళ్ళలేని [...]
  1. ఎక్కడా కనిపించదు ఎవరికీ వినిపించదు మనసు మాట...!! 2. రాలిన ఆకులు నిలిచిన నీళ్ళు వెలసిన గాలివానకు సాక్ష్యంగా...!! 3. చెదిరిన బొట్టు పగిలిన గాజులు మిగిలిన జీవచ్ఛవం...!!
  (నేడు జాతీయ ప్రసార దినోత్సవం) పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు [...]
  థమ్ చిత్రంలోని ఒక చక్కని మెలోడీని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.చిత్రం : థమ్ (2003)సంగీతం : రమణ గోగుల సాహిత్యం : సురేంద్ర కృష్ణగానం : హరిహరన్, నందిత చల్ల గాలికి చెప్పాలని ఉంది మన కథ ఈ వేళచందమామకు చెప్పాలని ఉంది సరసకు రావేలా?వింతలు చూపి పులకింతలు రేపి మురిపించే కలనితోడుగా ఉండి [...]
  కవిమిత్రులారా,ఈరోజు పూరించవలసిన సమస్య ఇది..."యమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్"(లేదా...)"యమునకె తప్ప దెప్పు డెటులైనను భస్మము గాక జీవుఁడా"శ్రీరాం వీరబ్రహ్మ కవి గారి పూరణ....విమలాంబర రత్నాభరణముల నలంకృతము గాంచి నవ షడ్రరసభోజ్యములన్ బెఱిగిన యీ కాయమునకె తప్పదుగ భస్మమగు టెపుడైనన్.('అవధాన విద్యాసర్వస్వము' గ్రంథంనుండి)
  నీతో సఖ్యముగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.. నీ తల్లితండ్రులకు తప్ప నీకు తప్పనిసరిగా మంచే చెయ్యాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో..
  పేజీ :    తరువాత >  
  
  Kinige
  Custom Search
  జల్లెడ గురించి సహాయం
  
  నా ఇష్టాలకు కలుపు | ©2008 జల్లెడ.కామ్ | అభిరుచులు